Monday, December 23, 2024

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులను మోసం చేస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులను టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్న ముగ్గురు సైబర్ నేరస్థులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఢిల్లీకి చెందిన భూపెందర్ కుమార్, హిమాన్షు కుమార్ గౌతం, సోను రాథోడ్ కలిసి నేరాలు చేస్తున్నారు. ముగ్గురు నిందితులు యాక్సిస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు దారుల వివరాలు తెలుసుకుని వారికి ఫోన్లు చేస్తున్నారు. ముందాగా వారి బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొయిల్‌ను మార్చి వేసి తర్వాత ఖాతాదారుడికి ఫోన్లు చేస్తున్నారు. మీ కార్డులపై ఉన్న రివార్డులను ఎన్‌క్యాష్ చేసుకోవాలంటే ఓటిపి చెప్పాలని నమ్మిస్తున్నారు. వాటిని నమ్మిన బాధితులు వీరికి ఓటిపి చెప్పడంతో వారి బ్యాంక్ ఖాతాలోని నగదును వారి బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన బాధితుడి మెయిల్ ఐడి మార్చి అతడి ఖాతా నుంచి మర్చెంట్ పేయూ, ఫోన్‌పేకు రూ.4,71,480 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న వారి వద్ద నుంచి క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని వాటితో గిఫ్ట్ కార్డులు, వోచర్లు కొనుగోలు చేస్తున్నారు. వాటితో క్రోమా, రిలయన్స్ తదితర స్టోర్లలో గోల్డ్ కాయిన్స్, జూవెల్లరీస్, ఐఫోన్లు కోనుగోలు చేసి తక్కువ ధరకు వాటిని విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన వాటిని 50 నుంచి 60శాతానికి తక్కువ విక్రయిస్తున్నారు. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులను ముగ్గురు కలిసి పంచుకుంటున్నారు. నిందితులపై సైబరాబాద్‌లో 23 కేసులు నమోదయ్యాయి. నిందితులపై దేశవ్యాప్తంగా 1,292 కేసులు, తెలంగాణలో 166 కేసుల నమోదయ్యాయి. నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఒక్కొక్కరు ఒక్కోటి తీసుకుంటారు….
ముగ్గురు నిందితులు కొట్టేసిన డబ్బులతో కొనుగోలు చేసిన వస్తువులను ఒక్కొక్కరు ఒకటి చొప్పున తీసుకుంటారు. సన్నీ మొబైల్ ఫోన్లను డెలివరీ తీసుకోగా, రోహిత్ గోల్డ్, మొబైల్ ఫోన్లను తీసుకుంటాడు. బంగారు ఆభరణాలను 65శాతం, జూవెల్లరీని 60శాతానికి, మొబైల్ ఫోన్లను 55శాతానికి , ఆడ్రాయిడ్ ఫోన్లను 50శాతానికి తక్కువకు విక్రయిస్తారు. నిందితులు బాధితులకు ఫోన్లు చేసే సమయంలో తమ వివరాలు పోలీసులకు తెలియకుండా ఉండేందుకు డెహ్రాడూన్, హరిద్వార్ తదితర ప్రాంతాలకు వెళ్లి ఫోన్లు చేస్తారు. పనిపూర్తయిన తర్వాత మళ్లీ ఢిల్లీకి వస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News