హైదరాబాద్: ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి దోచుకున్న ముగ్గురు నిందితులను మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి పేపర్ బ్లేడ్ కట్టర్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎడిసిపి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, కిషన్‌బాగ్‌కు చెందిన సయిద్ అబ్దుల్ హసన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, యాకత్‌పురకు చెందిన సయిద్ తలేబ్ అలీ అలియాస్ సమీర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బాల్‌శెట్టి కేత్‌కు చెందిన సయిద్ తాహెర్ అలీ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ దస్తగిరి ఈనెల 5వ తేదీన ప్రయాణికులను ఎక్కించుకుని వారి గమ్యస్థానంలో దించాడు. తర్వాత ఉదయం 5.30 గంటలకు మజీద్‌లో ప్రార్థన చేశాడు.ఆటోను సాలార్జంగ్ మ్యూజియం వద్ద ఆపి రెస్ట్ తీసుకుంటుండగా ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అందులో ఇద్దరు దస్తగిరి వద్దకు వచ్చి కత్తితో తొడలపై దాడి చేశారు. డబ్బులు, మొబైల్ ఫోన్ ఇవ్వాలని బెదిరించడంతో వారికి ఇచ్చివేశాడు.
తర్వాత మరో వ్యక్తి వచ్చి ఉన్న డబ్బులు మొత్తం ఇవ్వాలని బెదిరించి కూడి తొడపై దాడి చేశాడు. తర్వాత ముగ్గురు కలిసి అక్కడి నుంచి ఆటోలో పారిపోయారు. రక్తస్రావం కావడంతో బాధితుడు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మీర్‌చౌక్ పోలీసులు తెలిపారు. డిఐ దిలీప్‌కుమార్, తదితరులు నిందితులను పట్టుకున్నారు.