Tuesday, January 7, 2025

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ క్రైమ్: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురిని గురువారం టాస్క్ ఫోర్స్, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లోయర్ మానేరు డ్యాం బైపాస్ రోడ్డు లో గల ఎల్లమ్మ గుడి వద్ద ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యానికి చెందిన దుర్గం రమణ (24) దుర్గం జీవన్ (22) కొత్తపల్లి మండలం

మల్కాపూర్ కు చెందిన గాజుల మహేష్ (20) నెంబర్ లేని వాహనంపై వచ్చి ఎల్లమ్మ గుడి ప్రాంతంలో తిరుగుతూ ఉండగా, అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1.2 కిలోల గంజాయి పట్టుబడిందని పోలీసులు తెలిపారు. విచారణలో సదరు నిందితులు తాము ద్విచక్ర వాహనంపై తిరుగుతూ గంజాయిని విక్రయిస్తున్నామని తెలిపినట్లు పేర్కొన్నారు. వీరిపై కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News