Thursday, January 23, 2025

మైనర్ బాలికను బెదిరించిన ముగ్గురు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : హన్మకొండకి చెందిన మైనర్ విద్యార్థిని (16)ను ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు గురి చేసి అమ్మాయిని ట్రాప్ చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు నగలని తీసుకుపోయిన ముగ్గురు నేరస్తులని శనివారం అరెస్టు చేసి వారి వద్ద నుండి 5,77,500రూపాయల విలువ గల 11.55 తులాల బంగారు నగలని, 4సెల్‌ఫోన్‌లని రికవరీ చేసినట్లు కరీంనగర్ టూటౌన్ సీఐ రాంచందర్‌రావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జునైద్‌ఖాన్ (24) హుస్సేనిపురా, యశ్వంత్‌రాజ్ (22) రేకుర్తి గ్రామం, కొత్తపల్లి, భారత్ ఖయ్యూం ఖాన్ (22) హుస్సేనిపురా, కరీంనగర్ అను వారు పథకం ప్రకారం దాదాపు రెండు నెలల కిందట యశ్వంత్‌రాజ్‌కి హన్మకొండకి చెందిన ఒక అమ్మాయి పరిచయం కాగా ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగి అయినందున ఆమె వద్ద ఎక్కువ డబ్బులు, బంగారం ఉన్నదని యశ్వంత్‌రాజ్ తన స్నేహితుడు అయిన జునైద్‌ఖాన్, భారత్ ఖయ్యూం ఖాన్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు.

వారందరూ పథకం ప్రకారం జునైద్ ఖాన్ సదరు అమ్మాయితో యశ్వంత్‌రాజ్ ద్వారా పరిచయం చేసుకొని ఇంస్టాగ్రామ్‌లో ఆమెకు మెసేజ్‌లు పంపినట్లు తెలిపారు. ఆమె వాటికి రిప్లయ్ ఇవ్వగానే ఆమెతో స్నేహం చేసినట్లు నమ్మించారు. అలా కొద్ది రోజులు స్నేహంగా ఉన్నట్టు నటించిన తర్వాత ఆమెను నీవద్ద ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలతో కరీంనగర్‌లోని సర్కస్‌గ్రౌండ్ వద్దకు రమ్మనగానే ఆమె ఎందుకు అని నిలదీయడంతో ఆమెను నువ్వు నేను చెప్పినట్టు చేయకుంటే నీ యొక్క ఫోటోలను మార్ఫింగ్‌చేసి సోషల్ మీడియాలో పెడతానని, చంపుతానని బెదిరించగా ఆమె భయపడి 10-08-2023న మధ్యాహ్నం 2 గంటలకు సర్కస్ గ్రౌండ్ వద్దకు రాగా ముగ్గురు కూడా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెతెచ్చినటువంటి 6 (ఆరు) బంగారు గాజులు, రెండు జతల బంగారు కమ్మలు, ఒక బంగారు చైన్, బంగారం ముక్క తీసుకుని ఈ విషయం ఎవరికి చెప్పవద్దని ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిసిన లేదా చెప్పినట్టయితే మీ ఇంట్లో మగ వారు ఎవరు లేరు.

నిన్న మీ అమ్మను చంపి పడేస్తామని చెప్పిపంపించినట్లు తెలిపారు. ఈ విషయంను బాధితురాలు తన తల్లికి చెప్పగా బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసినట్లు తెలిపారు. శనివారం నేరస్తులను హుస్సేనిపురాలో అరెస్టు చేసి వారు బెదిరించి తీసుకున్న బంగారు నగలను, వారి మొబైల్ ఫోన్‌లని సీజ్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. కాగా జునైద్‌ఖాన్ గతంలో కొందరు అమాయకులను డబ్బులు ఆశ చూపి మాయమాటలు చెప్పి మోసం చేయగా అతనిపైన కరీంనగర్ వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్, రూరల్ పోలీస్‌స్టేషన్‌లలో వివిధ రకాలైన కేసులు నమోదైనట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News