బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చిన యువతి
అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో డబ్బులు కొట్టేసిన ముగ్గురు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నిందితుడు పరారీలో ఉండగా, ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ యువతి కూడా ఉంది. పోలీసుల కథనం ప్రకారం…రాజస్థాన్‌కు చెందిన ప్రధాన నిందితుడు, నజార్ భాష, మహారాష్ట్రకు చెందిన అల్‌ఫియా షేక్ ఇజ్రాయిల్(21) నర్సింగ్ కోర్సు చేస్తోంది. అలిఫియా అమ్మమ్మ తాతయ్య వద్ద ఉంటోంది. గతంలో పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఎల్‌పి ప్రాడక్ట్( ఫర్ ఎవర్ లివింగ్ ప్రాడక్ట్) పేరుతో ఇంటికి అవసరమైన చిన్న చిన్న వస్తువులను విక్రయించేందుకు సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వ్యాపారం అంతగా విజయవంతం కాకపోవడం మానివేసింది. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే డిసెంబర్,2021లో ఫేస్‌బుక్‌లో రాజస్థాన్‌కు చెందిన రాజ్‌వీర్ పరిచయం అయ్యాడు. ఇద్దరు కొద్ది రోజులు స్నేహం చేశారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
నిందితుడు పెట్టుబడి పేరుతో ఆన్‌లైన్‌లో పలువురిని మోసం చేశాడు. ఈ క్రమంలోనే అల్‌ఫియా బ్యాంక్ వివరాలు ఇస్తే ఇంటి అద్దె రూ.3,000 ఇస్తానని చెప్పాడు. అల్‌ఫియా బ్యాంక్ వివరాలు చెప్పడంతో వెంటనే డబ్బులు వేశాడు. ఇలాగే ఎక్కువగా బ్యాంక్ వివరాలు ఇస్తే కమీషన్ ఇస్తానని చెప్పడంతో యువతి పలువురి తన స్నేహితుల బ్యాంక్ ఖాతా నంబర్లు పంపించింది. వాటి ఆధారంగా నిందితుడు పలువురు బాధితులకు నుంచి డబ్బులు వీరి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయించాడు. సైనిక్‌పురికి చెందిన బాధితురాలి రూ.1,14,000 డిపాజిట్ చేయించారు. వాటిని అల్‌ఫియా నిందితుడికి పంపించింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైనిక్‌పురికి చెందిన మహిళకు ఆన్‌లైన్ మెసేజ్ వచ్చింది.
పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పారు. ఇది నమ్మి మొదటిసారి రూ.100 పెట్టింది. దానికి సైబర్ నేరస్థులు రూ.240 పంపించారు. తర్వాత ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో బాధితురాలు రూ.18,83,754 పెట్టింది. అప్పటి నుంచి సైబర్ నేరస్థులు తమ వివరాలను ఆన్‌లైన్ నుంచి తీసివేశారు. ఫోన్ చేసినా స్పందించలేదు, దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ సురెందర్ దర్యాప్తు చేశారు.