Wednesday, January 22, 2025

ముగ్గురు మైనర్ అక్కచెల్లెళ్లపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లాలో ముగ్గురు మైనర్ సోదరీమణులపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. బాధితుల తల్లిదండ్రులు విడిపోవడంతో తండ్రి సంరక్షణ లోనే ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉంటున్నారు. అయితే తండ్రి మద్యానికి బానిసై పోవడంతో ముగ్గురు అక్కచెల్లెళ్లు తీరని మనోవేదన అనుభవిస్తున్నారు. ఈ బలహీనతను నిందితులు ఆసరా చేసుకుని అక్కచెల్లెళ్లపై గత ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారని పోలీస్‌లు తెలిపారు. నిందితులు దత్తా క్షీరసాగర్ (35). నిషాద్ ఖాన్ (19),సయ్యద్ (27)లను ఆదివారం అరెస్ట్ చేశారు. పోక్సో తదితర చట్టాల కింద నేరాలు నమోదు చేసినట్టు సీనియర్ ఇన్‌స్పెక్టర్ పెల్హార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర వెంకోటి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News