హైదరాబాద్: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని దోచుకుంటున్న ముగ్గురు నిందితులను బహదుర్‌పుర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కత్తి, రూ.1,000లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం…బహదుర్‌పుర, కిషన్‌బాగ్, ముబారక్ దర్బార్‌కు చెందిన మహ్మద్ ఖాజా జైనులబేదిన్ అలియాస్ చోర్ ఖాజా ఆటోడ్రైవర్, రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ ముబీన్, అజాం ఖాన్ ముగ్గురు కలిసి ఒంటరిగా వెళ్తున్న వారిని కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులను దోచుకుంటున్నారు. ముబీన్‌పై హత్యాయత్నం కేసులు3, రాబరీ 3, దొంగతనాల కేసులు 24 ఉన్నాయి.
ముబీన్‌ను పోలీసులు 2016లో అరెస్టు చేసి పిడి యాక్ట్ పెట్టారు. అజాంపై ఒక రాబరీ కేసు, దొంగతనం కేసులు 7 ఉన్నాయి. ఖాజాజైనులాబేడిన్‌పై స్నాచింగ్ కేసులు 6, ఆర్మ్ యాక్ట్, గంజాయి కేసు, దొంగతనం కేసు మొత్తం పది కేసులు ఉన్నాయి. ముగ్గురు నిందితులు రాత్రి సమయంలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే వారిపై దాడి చేసి దోచుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీన ఓ వ్యక్తి కిషన్‌బాగ్ పరిసరాల్లో తిరుగుతుండగా అతడికి కత్తిని చూపించి రూ.4,500 దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, డిఐ శ్రీశైలం, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పట్టుకున్నారు.