Wednesday, January 22, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టిఎస్ నాబ్, పహాడీషరీఫ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,030గ్రాముల చరాస్, 2కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.7లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం..మహారాష్ట్రకు చెందిన హైదర్ హైదర్ ఇక్బాల్ సిద్ది మక్కా, ముస్తాక్ షా, పహాడీషరీఫ్‌కు చెందిన సయిద్ జావిద్ కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. జావిద్ గంజాయి, చరస్‌ను తెలిసిన వారి నుంచి ఫోన్‌లో తెలియని వారి నుంచి కొనుగోలు చేసి స్థానికంగా అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన హైదర్‌కు ఫోన్ చేసి గంజాయి, చరక్ కావాలని చెప్పడంతో తీసుకుని పహాడీషరీఫ్‌కు వచ్చాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ రెడ్డి, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News