Friday, December 20, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. యువకుల వద్ద నుంచి 7 గ్రాముల హెరాయిన్, మూడు మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. మెహిదీపట్నం, సంతోష్‌నగర్‌కు చెందిన మాన్‌సింగ్ బాట్ల అలియాస్ తేజ రౌడీషీటర్, హెల్త్‌కేర్ కన్సల్‌టెంట్‌గా పనిచేస్తున్నాడు. టోలీచౌకికి చెందిన సయిద్ ఓబైద్ రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, లంగర్‌హౌస్‌కు చెందిన సబ్బర్ హుస్సేన్ నిరుద్యోగి.

ముగ్గురు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న మాన్‌సింగ్ బాటాల చెఫ్‌గా పనిచేశాడు. తరచూ తన పాఠశాల, కాలేజీ స్నేహితులను కలిసేవాడు. తన సీనియర్లు గంజాయి తీసుకోవడం చూశాడు. తాను కూడా గంజాయి తీసుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నేరాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన చిన్ననాటి స్నేహితులు సయిద్ ఒబైద్, షబ్బార్ హుస్సేన్ కలిశాడు. ముగ్గురు కలిసి డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశారు. ముగ్గురు కలిసి రూ.10,000 కూడబెట్టి డ్రగ్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి గాను డ్రగ్స్ విక్రయించేవారి కోసం వెతుకుతుండగా బెంగళూరులో ఉంటున్న నైజీరియాకు చెందిన కాంటాక్ట్‌లోకి వచ్చాడు.

ఈ నెల 13వ తేదీన మాన్ సింగ్ బెంగళూరుకు వెళ్లి యశ్వంత్‌పూర్‌లో నైజీరియన్‌ను కలిసి 7గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు. దానిని సయిద్‌ఒబైద్, షాబార్ హుస్సేన్‌కు ఇచ్చేందుకు రేతిబౌలి ఎక్స్ రోడ్డులోని కాస్ట్ టు కాస్ట్ షూ షాపుకు వచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగార్జున, ఎస్సైలు అనంత చారి, కరుణాకర్‌రెడ్డి, నాగరాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News