Sunday, November 17, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యువకుల వద్ద నుంచి 11.34 గ్రాముల కొకైన్, 3.66 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్, బైక్ రెండు ఎన్‌వలప్స్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నిజామాబాద్‌కు చెందిన అబ్బుల సాయిశరత్(25), అబ్బుల శ్రావణ్ (23) బేగంపేటలో ఉంటూ బంజారాహిల్స్‌లో 2019లో లిటిల్ ఇడ్లీ రిస్టారెంట్‌ను ప్రారంభించారు. యూసుఫ్‌గూడకు చెందిన శ్రీవాత్సవ్ రిషబ్ కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. లిటిల్ ఇడ్లీ రెస్టారెంట్‌ను చెఫ్ సాయికిరణ్ నిర్వహిస్తున్నాడు. శరత్ ప్రేమలో విఫలం కావడంతో డ్రగ్స్‌కు బానిసగా మారాడు. సాయికిరణ్ ద్వారా శ్రీవాత్సవ రిషబ్‌తో పరిచయం ఏర్పడింది. రిషబ్ డ్రగ్స్‌కు బానిసగా మారడంతో గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇద్దరు కలిసి డ్రగ్స్ తీసుకునేవారు, మార్కెట్‌లో కొకైన్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దానిని తక్కువకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. శరత్‌కు ముంబాయికి చెందిన డ్రగ్స్ విక్రయించే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా కొకైన్‌ను ముంబాయి నుంచి కొరియర్‌లో తెప్పించే వాడు, వాటిని బేగంపేటలోని కొరియర్ ఆఫీసు నుంచి శరత్ తీసుకునేవాడు. వాటిని తీసుకుని వెళ్లి రిషబ్‌కు ఇవ్వడంతో అతడు అవసరం ఉన్న వారికి విక్రయించేవాడు. ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో రిషబ్‌ను జలవిహార్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు కోసం లేక్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగార్జున, ఎస్సైలు అనంతచారి, కరుణాకర్‌రెడిడ, నాగరాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News