Friday, November 15, 2024

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….టపాచపుత్రకు చెందిన అబ్దుల్ వాజిద్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ధూల్‌పేటకు చెందిన సురేందర్ సింగ్, ఆంగూరి బాయి వద్ద 1.5కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. దానిని చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని జుమ్మేరాత్ బజార్‌కు చెందిన ఎండి జావీద్, వినోద్ సింగ్ కలిసి గంజాయి విక్రయిస్తున్నారు.

ఇద్దరు నిందితులు రూ.150లకు గంజాయి ప్యాకెట్‌ను కొనుగోలు చేసి రూ.200 నుంచి రూ.300లకు విక్రయిస్తున్నారు. వినోద్ సింగ్ తరచూ గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఎపి రాష్ట్రం, విశాకపట్టణం జిల్లా, సీలేరకు వెళ్లే వాడు. అక్కడ ముట్టుల శ్రీను వద్ద గంజాయి కోనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి 10గ్రాముల చొప్పున ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించేందుకు జావీద్ మెహెర్బాన్ హోటల్ వద్ద ఆటోలో వేచి ఉండగా మొఘల్‌పుర పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో వినోద్ సింగ్‌ను జుమ్మేరాత్ బజార్ వద్ద ఉన్న రాణి అవంతిబాయి విగ్రహం వద్ద పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News