Monday, December 23, 2024

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2,62,500 విలువైన 10.5కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, వట్టేపల్లికి చెందిన షేక్ ఫైసల్ అలియాస్ ఫైసల్ షేక్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాడ్‌బన్‌కు చెందిన షేక్ ఒబైద్ బాజాబేర్ వాచ్ రిపేర్ చేస్తున్నాడు, ఫలక్‌నూమా, ఇంజిన్ బౌలికి చెందిన అన్వర్ అలీ ఖాన్ అలియాస్ షేక్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఫైసల్ షేక్ మార్కెట్‌లో గంజాయికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో తక్కువ ధరకు కొనగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ఒడిసా రాష్ట్రం, మల్కాన్‌గిరికి చెందిన బిశ్వాత్ జిత్ అలియాస్ వరుణ్‌ను కలిశాడు. అతడి వద్ద గంజాయిని రెండు కిలోలకు రూ.8,000 చొప్పున కొనుగోలు చేశాడు. దానిని హైదరాబాద్‌లో రూ.15,000 నుంచి రూ.20,000లకు విక్రయిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం బిశ్వజిత్ ఐదు రోజుల క్రితం 10.5కిలోల గంజాయి తీసుకుని నగరానికి వచ్చాడు.

ఇక్కడ ఫైసల్‌కు ఇచ్చాడు, దానిని అతడు తన స్నేహితుడు షేక్‌ఒబైద్‌కు 1.5కిలోలు, కిలో అన్వర్ అలీ ఖాన్‌కు గంజాయి విక్రయించాడు. వీరు అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ షేక్ జకీర్ హుస్సేన్, ఎస్సైలు ఆంజనేయులు, నర్సింహులు, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News