గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ సిబ్బంది గురువారం ధూల్‌పేటలో అరెస్టు చేశారు. మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ సిబ్బంది, నిందితుడి వద్ద నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…ధూల్‌పేటకు చెందిన రాజేందర్ సింగ్,బ్రిజ్ విక్కీ, మెతోరి చెన్నయ్య ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. ధూల్‌పేట్‌లో గాంజా రాజేందర్ సింగ్ ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగతున్నాయనే సమాచారం మేరకు ఎస్‌టిఎఫ్ టీమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
రాజేందర్ సింగ్ ఇంట్లో 2.014కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మకాలు జరుపుతున్న రాజేందర్ సింగ్, బ్రిజ్ విక్కీ, మెతోరి చెన్నయ్యను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు , బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వీరితో సంబంధం ఉన్న అకాష్ సింగ్, దుర్గేష్ సింగ్, వీరేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐలు మధుబాబు, గోపాల్, ఎస్సైలు లలిత, సైదులు, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్ రెడ్డి, అజీమ్, కానిస్టేబుళ్లు ప్రకాష్, మహేష్, రాకేష్, సతీష్, ఖలీల్ ఉన్నారు.