గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 250 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బీహార్ రాష్ట్రానికి చెందిన శిబుకుమార్ అనే యువకుడు జీడిమెట్లలోని రాంరెడ్డి నగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బీహార్ రాష్ట్రం నుంచి గంజాయి చాక్లెట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ కూలీలు, విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులకు తెలియడంతో౭ దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.11,500 విలువైన 150 గంజాయి చ్లాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రామచంద్రాపురం, బాలాజీనగర్‌లో బీహార్ రాష్ట్రానికి చెందిన సీతారాం సింగ్(60)
అనే వృద్ధుడు లేబర్ అడ్డాలలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. నిందితుడి వద్ద నుంచి 1960 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.30,000 ఉంటుంది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఓటి మాదాపూర్ పోలీసులు ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద ఇద్దరు విద్యార్థుల నుంచి చిన్న చిన్న ప్యాకెట్లలో ఉన్న 1.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సిగరేట్లు విక్రయిస్తున్న వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.16,000 విలువైన 114 ప్యాకెట్ల నిషేధిత సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్, బాలరాజ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.