Thursday, January 23, 2025

హెరాయిన్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హెరాయిన్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎక్సైజ్ డిటిఎఫ్ టీం సభ్యులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.50లక్షల విలువైన 70గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అజ్మల్ హెస్సేన్, నూర్ ఆజం ఖాన్, ఎస్‌కె సురోజ్ బతుకు దెరువు కోసం వచ్చి నగరంలో కూలీ పనులు చేస్తున్నారు. వచ్చే డబ్బులు అవసరాలకు సరిపోకపోవడంతో డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశారు.

పశ్బిమ బెంగాల్ వార్దాలో హెరాయిన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. శంషాబాద్, శేరిలింగంపల్లిలోని లవ్‌బోర్ని కాలనీ, అపోల ఆస్పత్రి వద్ద హెరాయిన్‌ను విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బందికి తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. 70గ్రాముల హెరాయిన్‌ను రూ.1,000లకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ గ్రాముకు రూ.500 విక్రయిస్తున్నారు. సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్, నెహ్రు, గణేష్, శేఖర్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News