Monday, December 23, 2024

బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బైక్‌లు చోరీచేస్తున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 బైక్‌లు, ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరానికి చెందిన ఎండి రయిస్ అలియాస్ ఇర్ఫాన్, ముజాహిద్ హుస్సేన్ అలియాస్ ఇమ్రాన్, ఎండి సకీబ్ ఉద్దిన్ ఖాన్ అలియాస్ షక్కు, అద్నాన్, సయిద్ అబ్దుల్ హసన్ కలిసి బైక్‌లను చోరీ చేస్తున్నారు. ఇందులో అద్నాన్, సయిద్ అబ్దుల్ హసన్ పరారీలో ఉన్నారు. నిందితులపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసులు ఉన్నాయి. పలు దొంగతనాలు చేయడంతో పోలీసులు గతంలో కేసులు నమోదు చేశారు. ముజాహిద్ హుస్సేన్‌పై ప్రాపర్టీ ఛీటింగ్ కేసు ఉంది.

అందరు నిందితులు తరచూ కలుసుకునేవారు. వారికి వచ్చే డబ్బులు వారి జల్సాలకు సరిపోకపోవడంతో బైక్‌లు, ఖరీదైన గ్యాడ్జెట్‌లు చోరీ చేయడం ప్రారంభించారు. వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. అందరు కలిసి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 మోటార్ సైకిళ్లను చోరీ చేశారు. నిందితులపై ఇప్పటి వరకు పోలీసులు 11 కేసులు నమోదు చేశారు. చోరీలు చేస్తున్న వీరిపై పోలీసులకు సమాచారం రావడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సంతోష్‌కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, నర్సింహులు, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News