Thursday, January 23, 2025

బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని చాదర్‌ఘాట్‌కు చెందిన ఎండి హైదర్ అలియాస్ సోను వాటర్ సప్లయ్ చేస్తున్నాడు, యాకత్‌పురాకు చెందిన సయిద్ అర్బాజ్ మెహిదీ బాకురీ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు, కంచన్‌బాగ్‌కు చెందిన ఎండి అబ్దుల్ సమద్ వ్యాపారం చేస్తున్నాడు. ముగ్గురి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.

వీరు చేస్తున్న పనులకు వచ్చే డబ్బులు సరిపోవడంలేదు. దీంతో బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించాడు. రాత్రి సమయంలో ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్నారు. వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. వీరు కొట్టేసిన బైక్‌లను ఎండి అబ్దుల్ సమద్ రిసీవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితులు మలక్‌పేట, అబిడ్స్, నాంపల్లి, ఫిల్మ్‌నగర్, సైబరాబాద్, ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ చేశారు. ఎస్సై నర్సింహులు, ఆంజనేయులు, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News