Monday, January 20, 2025

 బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, తుకారాంగేట్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల్లో బాలుడు ఉండగా, వారి వద్ద నుంచి తొమ్మిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, ముషీరాబాద్, బోలక్‌పూర్‌కు చెందిన ఎండి సోహైల్ ఎసి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు, ఎండి ఫైజ్ అలియాస్ ఫౌజ స్క్రాప్ షాప్‌లో పనిచేస్తున్నాడు, మరో బాలుడు కలిసి చోరీలు చేస్తున్నారు. ఎండి సోహైల్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిన నిందితుడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.

నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా మిగతా వారి వివరాలు చెప్పాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై తిరుగుతూ చోరీలు చేస్తున్నారు. ఇలా తొమ్మిది బైక్‌ల లాక్‌లను బ్రేక్ చేసి చోరీ చేశారు. తుకారాంగేట్, మల్కాజ్‌గిరి, గాంధీనగర్, కుషాయిగూడ, లాలాగూడ, సంఘారెడ్డి, ఉప్పల్, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్‌లను చోరీ చేశారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఆంజనేయులు, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News