- Advertisement -
హైదరాబాద్: నగరంలో భారీగా స్టెరాయిడ్ ఇంజక్షన్స్ పట్టుబడింది. స్టెరాయిడ్లు సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. శరీరం ఫిట్ గా ఉంటుందని స్టెరాయిడ్లు సరఫరా చేస్తోంది ఈ ముఠా. జిమ్ లో వ్యాయామం చేసే యువకులే లక్ష్యంగా స్టెరాయిడ్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యుల నుంచి 180 ఇంజక్షన్లు, 1100 మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఓంప్రకాష్, సరోదే నరేష్, సయ్యద్ ఫరూక్ గా గుర్తించారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
- Advertisement -