Wednesday, January 22, 2025

గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Three arrested for transporting Gutka

హైదరాబాద్: నిషేధిత గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన రూ.5,36,930 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. రాజస్థాన్ రాష్ట్రం, పాలి జిల్లాకు చెందిన మానక్ కుమావత్ అల్వాల్‌లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు, రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్ కుమావత్ అల్వాల్‌లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు, సోహన్‌లాల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితులు 2014లో బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ కిరాణా వ్యాపారం చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు టొబాకో, గుట్కా ప్యాకెట్లను కర్ణాటక రాష్ట్రం, బీదర్ నుంచి తీసుకుని వచ్చి నగరంలోని వివిధ పాన్‌షాపులు, కిరాణా షాపుల్లో విక్రయిస్తున్నారు. వీరు అల్వాల్‌లో గోడౌన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నిందితులు గుట్కా ప్యాకెట్లు, పొగాకు వస్తువులను కిరాణా షాపులు, పాన్‌షాపులకు వేసేందుకు గూడ్స్ వాహనంలో బయలుదేరారు. ఈ సమాచారం తెలియడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిపట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బొల్లారం పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, అశోక్ రెడ్డి, అనంత చారి, అరవింద్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News