Monday, December 23, 2024

బ్యాంక్ మోసం కేసులో ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

పని చేస్తున్న బ్యాంక్‌కు కన్నం వేసిన ఇద్దరు నిందితులు, వారికి సహకరించిన మరో వ్యక్తిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగీర్, అభ్యుదయ నగర్ కాలనీకి చెందిన కనుగుల రామస్వామి ఇండస్‌ఇండ్ బాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శంషాబాద్‌కు చెందిన సపాయి రాజేష్ బ్యాంక్ ఉద్యోగి, జూబ్లీహిల్స్‌కు చెందిన షేక్ బషీద్ కలిసి మోసం చేశారు. షేక్ బషీర్ ఫిలీం నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజంపేట నుంచి ఎంపిగా పోటీ చేశాడు. బషీర్ తాను బ్యాంక్‌లో రూ.100 కోట్లు డిపాజిట్ చేస్తానని బ్యాంక్ ఉద్యోగులకు చెప్పాడు.

అంతే కాకుండా రూ.40కోట్లు ఇచ్చినందుకు మేనేజర్ రామస్వామికి ఫార్చూనర్ రెండు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీనికి ఆశపడి బ్యాంక్ ఉద్యోగులు తమ హెడ్ ఆఫీస్ అనుమతి లేకుండానే రూ.40కోట్లను ఉదయ్ కుమార్ రెడ్డి బ్యాంక్ ఖాతాలకు పంపించారు. తర్వాత నిందితుడు బ్యాంక్‌లో ఎలాంటి డిపాజిట్ చేయకపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ జోనల్ హెడ్ మణికందన్ రామనాథన్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News