Sunday, November 17, 2024

డ్రంక్ డ్రైవ్ కేసులో ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Three arrested in drunk drive case in Hyderabad
డిసెంబర్ 31న రోడ్డు ప్రమాదం: సైకిలిస్ట్ మృతి

హైదరాబాద్: మద్యం తాగి కారు నడిపి ఓ సైకిలిస్టు మృతికి కారణమైన ముగ్గురు యువకులను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. జర్ఖాండ్ రాష్ట్రం, ఈస్ట్ సింగం జిల్లా, గోల్‌ముడికి చెందిన శశాంక్ శేఖర్ అలియాస్ చందన్ ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాకు చెందిన మానబేంద్ర రాయ్ ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నాడు, జార్ఖండ్ కు చెందిన ఇందుకూరి శ్రీకాంత్ పూణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శశాంక్ శేఖర్, మానబేంద్ర రాయ్ నగరంలో పనిచేస్తు మజీద్ బండలో ఉంటున్నారు. శశాంక్ స్నేహితుడైన శ్రీకాంత్ నగరానికి వచ్చాడు. ముగ్గురు కిలిసి గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన తమ ఫ్లాట్‌లో మందు పార్టీ చేసుకున్నారు.

తెల్లవారు జామున వరకు మద్యం తాగిన నిందితులు ఉదయం 5.30 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేయాలని ముగ్గురు కలిసి కారులో మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వైపు వస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న శశాంక్ శేఖర్ కారును డ్రైవింగ్ చేస్తుండగా ఇద్దరు కారులో ఉన్నారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలికి చెందిన నితిన్ అగర్వాల్, సంజీత్ శ్రీవాస్తవ, రాజీవ్ గజారియా సైకిల్‌పై బొటానికల్ గార్డెన్ వైపు నుంచి పాలపిట్ట సైకిలింగ్ పార్క్ వైపు వెళ్తున్నారు. మద్యం మత్తులో ఉన్న శశాంక్ కారుతో వారిని ఢీకొట్టడంతో నితిన్ అగర్వాల్ అక్కడికక్కడే మృతిచెందగా, సంజీత్ శ్రీవాత్సవ, రాజీవ్ గజారియాకు గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా మద్యం తాగి నట్లు తేలింది. శశాంక్‌కు 186 ఎంజి వచ్చింది. మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు తెలిసినా కూడా మిగతా ఇద్దరు వారించనందుకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News