Sunday, December 22, 2024

హత్య చేసింది స్నేహితులే..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సంచలనం సృష్టించిన జియాగూడ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జియాగూడలో ఆదివారం మధ్యాహ్నం ముగ్గురు యువకులు వెంటాడి కత్తులతో ఓ యువకుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. బాధితుడిని హత్య చేసింది యువకుడి స్నేహితేలేనని తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం….అంబర్‌పేటకు చెందిన జంగం సాయినాథ్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. బైక్‌పై జియాగూడ పురాణాపూల్ వైపు బైక్ వస్తుండగా నిందితులు ఇనుప రాడ్‌తో కొట్టారు. దీంతో సాయినాథ్ కిందపడడంతో కత్తులతో చంపేందుకు యత్నించారు.

వెంటనే యువకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు పరిగెత్తగా వెంటపడి నరికి చంపారు. విచారణ చేసిన పోలీసులు పథకం ప్రకారమే హత్య జరిగినట్లు దర్యాప్తులో తేల్చారు. హత్యకు కుట్రపన్నిన అక్షయ్, టిల్లు, సోను బైక్‌పై వస్తున్న సాయినాథ్ కదలికలను గమనిస్తు వచ్చారని, అనువైన ప్రదేశం కోసం వెంబడించారని పోలీసులు తెలిపారు. జియాగూడ మేకలమండీ సమీపంలో జనసంచారం లేకపోవడాన్ని అవకాశంగా చేసుకుని హత్య చేశారు. అదే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌పై వస్తు కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితులను 24 గంటల్లో పట్టుకున్నారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కారణంగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News