Sunday, December 22, 2024

ఉప్పల్ జంట హత్యల కేసులో ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Three arrested in Uppal twin murder case

నిందితుల్లో ప్రధాన నిందితుడి తల్లి

హైదరాబాద్: ఉప్పల్ జంట హత్యల కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను రాచకొండ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్, గాంధీనగర్‌కు చెందిన నర్సింహమూర్తి, అతడు కుమారుడు శ్రీనివాస్‌ను ఈ నెల 14వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హత్య చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు గడ్డి కార్తీక్, వాకిటి సుధాకర్, ప్రధాన నిందితుడు వినయ్ తల్లి సావిత్రిని పోలీసులు పట్టుకున్నారు. హత్య చేసిన అనంతరం నిందితులు వినయ్, బాలకృష్ణ పారిపోయేందుకు కార్తీక్, సుధాకర్ బైక్, నగదును అరెంజ్ చేశారు. హత్య చేసిన వచ్చిన వినయ్, బాలకృష్ణ దుస్తులను వినయ్ తల్లి సావిత్రి ఉతికారు. దీంతో ఆమెను ఏ8గా కేసులో చేర్చారు. ఎస్సై ఉద్యోగం రావాలంటే క్షుద్రపూజలు చేయాలని నమ్మించిన నర్సింహమూర్తి పూజ చేసేందుకు రూ.8లక్షలు తీసుకున్నాడు.

అయితే ఉద్యోగం రాకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడంతో వినయ్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు, దీనికి అనారోగ్యం తోడు కావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. దీని అంతటికి కారణం నర్సింహమూర్తి చేసిన పూజలేనని భావించిన నిందితులు నర్సింహమూర్తిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం నర్సింహమూర్తి ఇంటి బయట కూర్చోగా వినయ్, బాలకృష్ణ కొడవలి, కత్తులతో వచ్చి చంపివేశారు. తండ్రి కేకలు విని వచ్చిన కుమారుడు శ్రీనివాస్‌ను కూడ కత్తితో పొడవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు నిందితులు హత్య చేసిన అనంతరం ఎపిలోని కడప జిల్లా ఒంటిమిట్లకు పారిపోయారు, అక్కడి నుంచి విశాఖ చేరారు. నిందితులను అరెస్టు చేయగా మిగతా వారిని బుధవారం అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News