Monday, November 18, 2024

ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రభుత్వం ముగ్గురు కాంగ్రెస్ నాయకులను సలహాదారులుగా నియమించింది. మరొకరిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం నా డు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్క ర వేణుగోపాల్‌ను నియమించింది. ఈ మేరకు ముగ్గురు నేతలకు కేబినెట్ ర్యాంక్ కేటాయిస్తూ సి ఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా హర్క ర వేణుగోపాల్ ప్రభుత్వ వ్యవహారాలు, ముఖ్యమంత్రి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీని ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్రం గా శ్రమించి నిరాశ చెందారు. అప్పటి నుంచి కాస్త నిరుత్సాహంలో ఉన్న ఆయనకు అధిష్టానం భరో సా ఇస్తూ వచ్చింది. మరోవైపు కామారెడ్డిలో తీవ్ర పోటీ ఉండడంతో నిజామాబాద్ అర్బన్ నుంచి పో టీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీకి కూడా పార్టీ కీల క బాధ్యతలు అప్పచెబుతామని అధిష్ఠానం సూ చించింది. వీరిద్దరితో పాటు హర్కర వేణుగోపాల్ కూడా సంతృప్తి చెందేలా తాజాగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించింది. వీరికి సముచిత పదవులు కల్పించి న్యాయం చేశారని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నలుగురికి మంత్రులు శుభాకాంక్షలు తెలియచేశారు.

Shabbir Ali

Venugopal

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News