డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 30 ఎల్‌ఎస్‌డి డ్రాగ్స్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.70వేలు ఉంటుంది. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న చరణ్ తేజ్, కౌశిక్ తూబోటి, సయ్యద్ సర్ఫరాజ్ సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. డ్రగ్స్‌కు ముగ్గురు విద్యార్థులు బానిసలుగా మారారు, దీంతో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వీరి వద్ద డబ్బులు లేవు. ఈ క్రమంలోనే డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశారు. చెన్నైలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు
చేసి హైదరాబాద్ కు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని మాదాపూర్ రోడ్ నంబర్ 37లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు 30ఎల్‌ఎస్‌డి డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎక్సైజ్ డిటిఎఫ్ సీఐ శిరీష టీం సభ్యులు పట్టుకున్నారు. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న చెన్నైకి చెందిన అరుణ్ రాజ్ పై కేసు నమోదు చేశారు. అరుణ్‌రాజ్ పరారీలో ఉన్నాడని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్ పట్టుకున్న వారిలో డిటిఎఫ్ సీఐ శిరీష తో పాటు కానిస్టేబుల్స్ నయీముద్దీన్, ఖయాముద్దీన్, మౌనిక ఉన్నారు.
మాదాపూర్‌లో డ్రగ్స్…
మాదాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80వేల విలువైన 5.77 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటల్ మేనేజ్మెంట్, చిరు ఉద్యోగం చేస్తున్న ముగ్గురు దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఏ మార్ట్ వస్తున్న ఆదాయాన్ని సరిపోవడం లేదని డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశారు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో డిఎస్పి తిరుపతి యాద్ తన టీం సభ్యులతో కలిసి వెళ్లి బుధవారం అర్ధరాత్రి 1.30గంటలకు ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.