Wednesday, January 22, 2025

సంతోషానికి అవధులు లేవు.. ఒకే కాన్పులో ముగ్గురు జననం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తాండూరు రూరల్: ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఆడపిల్లలు పుట్టడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తాండూరు మండలంలోని కోటబాసుపల్లి గ్రామానికి చెందిన వడ్డె కర్నూల్ నవీన్, లక్ష్మీ దంపతులు. వీరికి మూడు సంవత్సరాల క్రితం వివాహాం జరిగింది. గతేడాది వీరికి ఒక పాప, బాబు పుట్టి చనిపోయారు.

ప్రస్తుతం ఆ దంపతులకు మూడు రోజుల క్రితం పండంటి ఆడపిల్లలు జన్మించారు. గత బుధవారం లక్ష్మీకి పురిటినొప్పులు రావడంతో తాండూరుకు తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు లక్ష్మీని హైదరాబాద్లోని నిలోఫర్‌కు రిఫర్ చేశారు. గు రువారం లక్ష్మీకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. దంపతులు నాపరాతి గనిలో కూలీలు. కుటుంబ పోషణ భారంగా మారిందని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News