Saturday, December 21, 2024

ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ఇవ్వడం దేశానికి గర్వకారణం

- Advertisement -
- Advertisement -

భారత్‌కు ఆర్థిక సంస్కరణలు పునాది వేసిన మహానీయడు పివి: బిజెపి నేత ప్రేమేందర్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు కేంద్రప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం హర్షనీయమని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి అన్నారు. బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో వారు చేసిన అమూల్యమైన సేవలకు ఇదే నిజమైన గుర్తింపుగా భావిస్తూ స్వాగతిస్తున్నామని, ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ తరుపున ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ స్వాతంత్య్ర కోసం నిజాంపై పోరాడిన పోరాట యోధుడిగా నిలవడమే కాకుండా దేశంలో ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేసిన పివికి భారతరత్నతో గౌరవించడం మరువలేమన్నారు. మరో మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు కూడా భారత రత్న ఇచ్చి గౌరవించుకోవడం గర్వకారణమని, రైతుల సంక్షేమం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఒక ఎమ్మెల్యేగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా పని చేసిన దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని ప్రశంసించారు.
భారత హరిత విప్లవ పితామహుడుగా గౌరవించబడిన డా.స్వామినాథన్ మార్గదర్శక కృషి దేశం వ్యవసాయ భూభాగాన్ని పునర్నిర్మించడమే కాకుండా ఆహార కొరతతో పోరాడటానికి శాస్త్రీయ నైపుణ్యం, అంకితభావానికి శాశ్వత ఉదాహరణగా నిలిచారని పేర్కొన్నారు. దేశానికే కాకుండా ప్రపంచానికి అత్యున్నత సేవలందించిన మహానుభావులకు భారతరత్నతో గౌరవించుకోవడం నిజమైన గౌరవమన్నారు.

మోడీ ప్రభుత్వం ఎటువంటి సిఫార్సులు లేకుండా అసలైన రత్నాలకు భారతరత్నతో గౌరవించడాన్ని స్వాగతిస్తూ పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు జరిపేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. బిజెపి శ్రేణులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News