Monday, December 23, 2024

మక్కా మసీదులో నినాదాలు చేసిన ముగ్గురు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని చారిత్రక మక్కా మసీదులో రెండు రోజుల క్రితం ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసి, ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు ముగ్గురిని అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు మక్కా మసీదు మెట్లపై కూర్చుని తర్వాత హఠాత్తుగా లేచి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారని హుసైనీ ఆలం పోలీస్ స్టేషన్‌కు చెంఇన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ ఖైసరుద్దీన్, మక్కా మసీదు సెక్యూరిటీ ఇన్‌ఛార్జీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్టు చేశారు. వారు ఉన్నపళంగా నినాదాలు చేసేసరికి మసీదులో ఉన్న ముస్లింలు ఉలికి పడి, వారి అభ్యంతరకర చర్యను నిలదీశారు.

నినాదాలు చేసిన ముగ్గురిని అక్కడున్న వారు వెంటనే పట్టుకున్నారు. వారి పేర్లు వెంకట్, అమోల్, విశాల్. కాగా వారిలో వెంకట్, అమోల్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారు కాగా, విశాల్ అనే వ్యక్తి కర్నాటకకు చెందిన వాడు. ఈ వివరాలను హైసైనీ ఆలంకు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ జె.ప్రియాంక తెలిపారు. మక్కామసీదులో ప్రశాంతతను చెడగొట్టేందుకు ప్రయత్నించినందుకు గాను వారి ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపిసి సెక్షన్లు 295(ఎ), 298 కింద కేసులు పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News