- Advertisement -
ధర్మపురి: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో విషాదం నెలకొంది. తుమ్మెనాల చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత పడ్డారు. తుమ్మెనాల చెరువులో ఆదివారం ఉదయం ముగ్గురు ఈతకు వెళ్లారు. చెరువులో యశాంత్(13), శరత్(12), నవదీప్ (15) మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -