Sunday, December 22, 2024

విద్యుదాఘాతంతో ముగ్గురు సోదరులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాటర్ సంప్ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతం రావడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన నగరంలోని షేక్‌పేట, పారామౌంట్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…చార్మినార్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహబూబ్‌కు ఇద్దరు కుమారులు రిజ్వాన్(18) ఇంటర్ చదువుతున్నాడు, అబ్దుల్ రజాక్(16) పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి రంజాన్ ఇఫ్తార్ ముగిసిన తర్వాత సంపు మోటార్ కరాబవడంతో ఎలక్ట్రిషన్ వచ్చి చేసేందుకు యత్నించాడు. కానీ బాగు కాకపోవడంతో ఫీజులను అక్కడే పెట్టి ఎలక్ట్రిషియన్ వెళ్లి పోయాడు. ఈ విషయం తెలియని రిజ్వాన్ ఇంట్లోని సంప్ మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్లాడు.

అక్కడ లోపల కరెంట్ వైర్ ఓపెన్ కావడాని చూశాడు. దానిని సరిచేసేందుకు సంపులోకి దిగడంతో అప్పటికే సంపులో విద్యుత్ సప్లయ్ కావడంతో రిజ్వాన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న రజాక్, అతడి స్నేహితుడు సయ్యద్ అన్‌సుద్దిన్ హుస్సేన్(18) కాపాడేందుకు ప్రయత్నించారు. రిజ్వాన్ రెండు చేతులు పట్టుకుని సంప్‌లో నుంచి బయటికి తీసేందుకు యత్నించారు. అప్పటికే విద్యుదాఘాతానికి గురి కావడంతో ఇద్దరికి కూడా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో ముగ్గురు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురు యువకులు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రంజాన్ మాసంలోనే యువకులు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలు పోస్టుమార్టం కోస ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News