Wednesday, January 22, 2025

విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి

- Advertisement -
- Advertisement -

మంథని : మండలంలోని వెంకటాపూర్ పంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్‌కు గురై మూడు గేదెలు ఆదివారం మృతి చెందాయి. నాగపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని స్వర్ణపెల్లి గ్రామానికి చెందిన కుంభం బాపుకు చెందిన మూడు గేదెలు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. పాలిచ్చే గేదెలు ఒక్కసారిగా విద్యుత్ షాక్‌తో చనిపోవడం జీర్ణించుకోలేక పోతున్నాడు. తమకు జీవనాధారమైన గేదెలు ఒకేసారి మూడు చనిపోవడంతో ఉపాధి కోల్పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఒక్కొ గేదె విలువ రూ.50 వేల వరకు ఉంటుందని తనకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతు అధికారులను కోరుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News