Tuesday, April 1, 2025

ఖమ్మంలో బిజెపి విధ్వంసంపై మూడు కేసులు

- Advertisement -
- Advertisement -

Three cases on BJP sabotage in Khammam

16మంది బిజెపి కార్యకర్తలపై కేసు నమోదు

బిజెపి కార్యకర్తపై దాడి సంఘటనలో టిఆర్‌ఎస్ నేతపై కేసు
సాయి గణేశ్ మృతిపై కేసు నమోదు చేయాలి: బిజెపి డిమాండ్

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో శనివారం బిజెపి కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై మొత్తం 16మందిపై పోలీసులు మూడు కేసులను నమోదు చేశారు. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక బిజెపి అనుబంధ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సామినేని సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో కోపొద్రిక్తులైన బిజెపి కార్యకర్తలు శనివారం ఖమ్మం నగరంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని అ ద్దాలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇల్లెందు క్రాస్‌రోడ్డులో ఆర్టీసి బస్సుల అ ద్దాలను పగులగొట్టడం, మమ త ఆసుపత్రి రోడ్డులో మంత్రి కెటిఆర్, పువ్వాడ కటౌట్లకు ని ప్పు పెట్టిన సంఘటనపై ఖ మ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏపూరి నాగేశ్వర్‌రావు, పా పారావు సహా మొత్తం 16మందిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సిఐ శ్రీధర్ తెలిపారు. అదేవిధంగా బిజెపి కి చెందిన కార్యకర్త వేల్పుల చంద్రశేఖర్‌పై దాడి చేసిన సం ఘటనపై టిఆర్‌ఎస్ కార్యకర్తలపై కూడా మరో కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

సాయిగణేశ్ మృతిపై కేసు నమోదు చేయాలి: బిజెపి

సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పోలీస్ కమిషనర్‌ను ఆ పార్టీ నేతలు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సాయి గణేశ్ మరణించే ముందు మీడియాకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్ విచారణ చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, సన్నే ఉదయ్ ప్రతాప్, రుద్ర ప్రదీప్, గెంట్యాల విద్యాసాగర్ తదితరులు పోలీస్ కమిషనర్‌ను కలిసి విన్నవించారు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న సంఘటనలో పోలీసులు సత్వరమే జడ్జి ముందు వాంగ్మూలం తీసుకోవాలని కానీ, ఈ ఘటనలో పోలీసులు ఎందుకు డెత్ డిక్లరేషన్ తీసుకోలేదని బిజెపి నేతలు ప్రశ్నించారు. ఉద్దేశ్య పూర్వకంగానే డెత్ డిక్లరేషన్ తీసుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఈనెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన సాయిగణేశ్‌పై ఆత్మహత్యప్రయత్నం నేరం క్రింద అతనిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే కేసును సుసైడ్ కేసుగా మార్చుతామని త్రీటౌన్ పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు సాయి గణేశ్ మృతిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ జారీ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News