Monday, December 23, 2024

ఇంట్లో అగ్నిప్రమాదం..ముగ్గురు చిన్నారుల సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

భోపాల్ : ఒక ఇంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా దానేకపూరా గ్రామంలో శనివారం ఉదయం ఒక ఇంట్లో మంటలు చెలరేగి చిక్కుకున్న ముగ్గురు చిన్నారులు సజీవదహనమయ్యారు.

వీరంతా నాలుగు, పదేళ్ల లోపు వారు. ఇద్దరు బాలికలు కాగా, ఒకరు బాలుడు. ఇంటి యజమాని అఖిలేష్, అతని భార్య, కూతురు , కోడలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గ్వాలియర్ ఆస్పత్రికి తరలించారు. వంట చేస్తున్నప్పుడు గ్యాస్ లీక్ కావడమే ప్రమాదానికి దారి తీసిందని అనుమానిస్తున్నారు. పోలీస్‌లు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News