Monday, December 23, 2024

యుపిలో బీహారీ ఇటుక కూలీల్లో విషాదం

- Advertisement -
- Advertisement -

అమ్రోహి : ఉత్తరప్రదేశ్‌లో వాన నీటితో నిండిన గుంతలో పడి ముగ్గురు బాలలు జలసమాధి అయ్యారు. గజ్రౌలా గ్రామంలో ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీల పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉండగా వాననీటితో కూడిన గుంతల్లో కూరుకుపొయ్యారని పోలీసులు తెలిపారు. ఇటుకబట్టీల యజమాని ఈ గుంతలను తవ్వి వదిలిపెట్టారు. ఇందులో నీరు నిండి ఉంది. గుంతలు ఉన్నాయనితెలియని బాలలు ఆడుకుంటూ ఉండగా వీటిలో పడి ప్రాణాలు వదిలారు.

Also Read: గోదావరి నదిలో యువకుడి గల్లంతు

ఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులు సమీపంలోని ఇటుకబట్టీల్లో కూలీలుగా రోజువారి కూలీపనిలో ఉన్నారు. బిగ్గరగా చప్పుడు కావడంతో వారు పరుగులపై వచ్చి పిల్లలను బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది. వారి ప్రాణాలు అప్పటికే గాలిలో కలిశాయి. ఈ ప్రాంతంలో బీహార్‌కు చెందిన పాతిక కుటుంబాలు కూలీలుగా పనిచేస్తున్నారు. రజబ్ అలీ అనే ఆసామీ ఇక్కడ బట్టిలను నిర్వహిస్తూ ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News