Wednesday, January 22, 2025

కోచింగ్ సెంటర్ నీట మునిగి ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురవడంతో ఢిల్లీలోని ఓల్డ్ రాజీందర్ నగర్‌లో భారీ వరద రావడంతో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లోకి నీళ్లు వచ్చాయి. ఐఎఎస్ సెంటర్ నీట మునిగి పోవడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. శనివారం ఏడు గంటల ప్రాంతంలో రావు ఐఎఎస్ స్టడీ సెంటర్ నీటిలో మునిగిందని సమాచారం రావడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సెల్లార్‌తో పాటు మొదటి ఫ్లోర్ నీటి మునిగినట్టు గుర్తించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి మూడు మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు కేరళ, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ కు చెందిన సివిల్స్ సర్వీస్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News