Thursday, January 23, 2025

అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Three commits suicide in same family suffering from debt

మన తెలంగాణ /చొప్పదండి : అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చొప్పదండి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన బైరి శంకరయ్య (54), అతని భార్య జమున (50), కొడుకు శ్రీధర్ (25)లు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు తలుపు బయటకు తాళం వేసి వేరే డోరు ద్వారా లోపలికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు భైరి శంకరయ్య కూతురు అఖిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చొప్పదండి ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు. విషయం తెలిసిన స్థానిక ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News