Thursday, December 19, 2024

పోలీసుల అదుపులో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన కేసులో గురువారం తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయటం విశేషం. అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి బిజెపి నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ముగ్గురు కాంగ్రెస్ నేతల్లో మన్నే సతీష్, నవీన్, తస్లీమాలు ఉన్నారు. వీరిని అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి కేసులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గత నెల 29వ తేదీన సిఎం రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీశ్, కో-ఆర్డినేటర్ నవీన్, పిసిసి కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్‌కు పంపించారు. ఈ నోటీసులు అందుకున్న నేతలు మే 1వ తేదీన విచారణకు హాజరు కాని పక్షంలో సీఆర్పీసీ 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం వారు ఏప్రిల్ 28న ఐటీ చట్టంతో పాటు ఐపిసి 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ ప్రకారం నోటీసులు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News