Monday, December 23, 2024

మామూళ్లు, రాసలీలల పోలీసులపై వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: వ్యభిచార ముఠాలు, స్పాసెంటర్ల వ ద్ద నుంచి నెల వారీ వసూళ్లు చేయడమే కాకుండా, వ్యభిచారులతో రాసలీలు జరుపుతున్న ముగ్గురు కానిస్టేబుళ్లు, హోంగార్డును స స్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆదేశా లు జారీ చేశారు. మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న దా మోదర్, నాగరాజు, సతీష్, హోంగార్డు రాజు కలిసి స్పాసెంటర్లు, వ్యభిచార గృహాల వద్ద నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంజనీర్స్ కాలనీలోని రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పాలో క్రాస్ మ సాజ్‌తోపాటు వ్యభిచారం చేస్తున్నారు. వీరి వద్ద నుంచి పోలీసు కా నిస్టేబుళ్లు డబ్బులు వసూలు చేయడమే కాకుండా కొత్తగా యువతులు వస్తే వారితో రాసలీలు జరుపుతున్నారు.

ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పా సెంటర్‌పై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ని ర్వాహకులు బాలరాజు, రజితను అరెస్టు చేశారు. వారిని మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే వా రు నెలనెలా పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామని ఎందుకు అరె స్టు చేశారని నిలదీశారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన పోలీసు లు విచారణ చేశారు. స్పా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా స్పా సెంటర్‌లోకి వెళ్లి వచ్చిన విషయం బయటపడింది. దీనిపై విచారణ చేసిన పోలీసులు హైదరాబాద్ పోలీస్ కమిషర్ శ్రీనివాస రెడ్డి నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించిన కమిషనర్ ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, హోంగార్డు రాజును పోలీస్ మోటార్ ట్రాన్స్‌పోర్టుకు అటాచ్డ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News