Wednesday, January 22, 2025

మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉచిత రేషన్‌ను వచ్చే ఐదేళ్లు కూడా అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేర్చడంతో పాటు రూ. ఐదు లక్షల రకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పేదలకు నాలుగు కోట్లు ఇళ్లు కట్టించి ఇచ్చామని, మరో మూడు కోట్లు ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. బిజెపి సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడదల చేసిన సందర్భంగా పిఎం మోడీ ప్రసంగించారు. భవిష్యత్తులో పైపులైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తామని హామీ ఇచ్చారు. పిఎం సూర్య ఘర్ పథకానికి కోటి మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఇంట్లో తయారైన కరెంట్‌ను మీరు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు.

ముద్ర పథకం కింద కోట్ల మందికి స్వయం ఉపాధి లభించిందని, ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలకు పెంచుతామని, చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని, దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. పదేళ్లలో పది కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారని, మహిళలు ప్రారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచుతామని, భారత్‌ను గ్లోబల్ న్యూట్రిషన్ హబ్‌గా మారుస్తామని, శ్రీ అన్న్ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్య్సకారులను ప్రోత్సహిస్తామని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News