Monday, January 20, 2025

మందుపాతర పేలి ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లకు గాయాలు

- Advertisement -
- Advertisement -

రాయిపూర్ : చత్తీస్‌గఢ్ బీజపూర్ జిల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి సోమవారం ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లోని టేకెమెట్ట కొండ ప్రాంతానికి సమీపంలో సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

గాయపడిన వారిలో సిఆర్‌పిఎఫ్ కు చెందిన అమిత్ కీర్తనీయ, రిపాన్ కుమార్ సాహూ, విశాల్ కుమార్ ఉన్నారు. ప్రాథమికంగా వీరికి బీజపూర్ ఆస్పత్రిలో చికిత్సతరువాత రాయ్‌పూర్‌కు చికిత్స కోసం విమానంలో తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News