Monday, January 20, 2025

వేర్వేరు సైబర్ నేరాల్లో ముగ్గురు యువకుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో యువతులను వేధించిన నిందితులు
అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
Cyber Criminals cheated a Man in Kamareddy

మనతెలంగాణ, సిటిబ్యూరో: సోషల్ మీడియాలో యువతులను వేధింపులకు గురిచేస్తున్న ముగ్గురు యువకులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం, ఉప్పులూరు గ్రామానికి చెందిన బొర్రా రామకృష్ణ ప్రసాద్ మచిలీపట్నం, నిజాంపేట గ్రామంలో ఉంటున్నాడు. నిందితుడికి బాధితురాలు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. నిందితుడి డబ్బులు అవసరం ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పరిచయమైన బాధితుల ఫొటోలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాధితురాలు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. నిందితుడు యువతి న్యూడ్ ఫొటోలు సేకరించి భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేశాడు.

కానీ నిందితుడి ప్రవర్తన చూసిన యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడి ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నగరంలోని బోరబండకు చెందిన రాడపాకా ప్రభుకిరణ్ బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంక్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పోర్న్‌వెబ్‌సైట్లలో అశ్లీలచిత్రాలు చూసేందుకు బానిసగా మారాడు. బ్లూడ్.కామ్, చాటెండ్ విత్ గర్ల్‌లో ఖాతాలు తెరిచాడు. అందులో నుంచి పలువురు యువతులకు రిక్వెస్ట్ పంపించాడు. దానికి యువతి రెస్పాండ్ కాలేదు, అప్పటి నుంచి బాధితురాలిపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆమె మొబైల్ నంబర్‌ను ఫేస్‌బుక్‌లో ఆమె క్యారెక్టర్‌ను దిగజార్చే ప్రయత్నం చేశాడు.

ఇది గమనించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్స్‌స్పెక్టర్ రాము దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కేసులో మేడ్చల్ జిల్లా, నేరెడ్‌మెట్, అమ్ముగూడ రైల్వే స్టేషన్ సమీపానికి చెందిన బొల్లం కిషన్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉంటున్న యువతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. దానికి యువతి నిరాకరించింది, అప్పటి నుంచి యువతిపై నిందితుడు కోపం పెంచుకున్నాడు. బాధితురాలి పేరుమీద ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా ఓపెన్ చేశాడు. యువతి ఫొటో ఫ్రొఫైల్ ఫొటో పెట్టి అసభ్య మెసేజ్‌లు పెడుతున్నాడు. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్‌స్పెక్టర్ వెంకటేష్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News