Sunday, December 22, 2024

మద్యం మత్తులో ముగ్గురు కూతుళ్ల గొంతులు కోసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

కొట్టాయం : మద్యానికి బానిసైన తండ్రి తన ముగ్గురు కూతుళ్ల గొంతుకలను కోసిన సంఘటన ఆదివారం రాత్రి కేరళ రాష్ట్రం కొట్టాయంలో జరిగింది. నిందితుడు మద్యానికి బానిసై వేధిస్తుండడంతో అతని వేధింపులు పడలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తన ముగ్గురు కుమార్తెలను భర్త వద్దనే విడిచిపెట్టేసింది. 15 ఏళ్ల లోపు వయసున్న ఈ ముగ్గురు కుమార్తెలను ఏడాదికాలంగా తండ్రే పోషిస్తున్నాడు. అయితే భార్య తిరిగి రాకపోవడంతో మరింత ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి విపరీతంగా మద్యం సేవించి వచ్చి తన ముగ్గురు కూతుళ్ల గొంతుకలు కోసేశాడు. తరువాత తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బాధితులు ప్రాణాలు కోల్పోలేదు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీస్‌లు చెప్పారు. చిన్నకూతురు పరిస్థితి విషమంగా ఉందని మిగతా ఇద్దరు కూతుళ్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీస్‌లు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News