Monday, January 20, 2025

మరో మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదారబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర చత్తిస్‌గఢ్ నుంచి ద్రోణి విదర్భ ,మరాఠ్వాడ , ఇంటిరియర్ కర్ణాకట మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టం 0.9 కి.మి ఎత్తువద్ద కొనసాగుతున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరో వైపు ఎండలు మండిపోతున్నాయి.

పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం భద్రాచలంలో 38.3డిగ్రీలు నమోదయింది. అదిలాబాద్‌లో 38.3, హకీంపేటలో 34.2, దుండిగల్‌లో 36.2, హనుమకొండలో 34.5, హైదరాబాద్‌లో 35.9, మహబూబ్‌నగర్‌లో 38.2, ఖమ్మంలో 36.6, మెదక్‌లో 36.2, నల్లగొండలో 35, నిజామబాద్‌లో 37.5, రామగుండంలో 36.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News