Thursday, January 23, 2025

పేపర్ లీకేజీ నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీక్ చేసిన ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్య, రాజేశ్వర్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులకు మరింత సమాచారం కావాల్సి వచ్చింది.

దాదాపుగా 40మందిని విచారించిన సిట్ అధికారులు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని ఎవరికి ప్రశ్నపత్రాలు విక్రయించారో నిర్ధారించుకునేందుకు కోర్టులో కస్టడీ పిటీషన్ వేశారు. దీంతో దానికి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నిందితులను విచారించి ఇంకా ఎవరికి ప్రశ్నపత్రాలు విక్రయించారు, ఇలా ఎన్ని పేపర్లను లీక్ చేశారనే విషయం నిర్ధారించుకోనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News