Monday, December 23, 2024

మరో మూడు రోజలు తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరో మూడురోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 23న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 24న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్,

సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. 25న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది.బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది.అత్యధికంగా కామారెడ్డిజిల్లా సదాశివనగర్‌లో 26.8 మి.మి వర్షం కురిసింది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44డిగ్రీలకు చేరుకున్నాయి. నిర్మల్‌జిల్లా కుబీర్‌లో 44.2డిగ్రీలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News