- Advertisement -
అమరావతి: కాకినాడ సమీపంలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలోని కన్వేయర్ బెల్ట్ వద్ద పేలుగు సంభవించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -