Monday, January 20, 2025

బొగ్గు గనికూలిపోయి ముగ్గురి మృతి: చిక్కుకున్న పలువురు కార్మికులు

- Advertisement -
- Advertisement -

 

ధన్‌బాద్: జార్ఖండ్‌లోని భొవ్రా బొగ్గు గని ప్రాంతంలో శుక్రవారం అక్రమంగా నిర్వహిస్తున్న ఒక గని కూలిపోగా ముగ్గురు మరణించారు. అనేక మంది కార్మికులు గనిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడకు 21 ఇలోమీటర్ల దూరంలోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బిసిసిఎల్)కు చెందిన భోవ్రా కాలరీ ప్రాంతంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బాధితులను గుర్తించిన తర్వాతే కచ్ఛితంగా ఎంతమంది కార్మికులు గనిలోపల మరనించిందీ, చిక్కుకుపోయింది

నిర్ధారించగలమని సిందిరి సిఎస్‌పి అభిషేక్ కుమార్ తెలిపారు. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గని కూలిపోయిన సమయంలో లోపల చాలామంది కార్మికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల సాయంతో ముగ్గురు కార్మికులను వెలుపలకు తీసుకురాగలిగామని, వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరనించారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గనిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు భోవ్రా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బినోద్ ఓరాన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News