- Advertisement -
తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంలోకి పాదరక్షలు ధరించి ముగ్గురు భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన ఆలయ సిబ్బంది వారిని అడ్డుకొని పాదరక్షలు విప్పించారు. అయితే ఆలయ పరిసరాలకు వచ్చే వరకూ పాదరక్షలు గమనించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిటిడి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని.. అంటున్నారు. మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టిటిడి విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించకపోవడంపై మండిపడుతున్నారు.
- Advertisement -