Thursday, January 23, 2025

కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

సివాన్ (బీహార్): బీహార్ లోని సివాన్ జిల్లా బాలా గ్రామంలో కల్తీ మద్యం తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన ప్రకారం మద్యం తాగిన వారిలో 10 మంది కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సివాన్ జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. సివాన్ జిల్లా ఆస్పత్రిలో ఒకరు చనిపోగా, పాట్నా మెడికల్ కాలేజీ , ఆస్పత్రిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతతో జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెప్పారు.

2016 ఏప్రిల్ నుంచి లిక్కర్ విక్రయాలు, వినియోగం నిషేధం అమలు లోకి వచ్చింది. పోస్ట్‌మార్టమ్ నివేదికలు వస్తేనే కానీ వారి మరణాలకు కారణం ఏమిటో తెలీదని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బందిని నియమించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో బీహార్ శరణ్ జిల్లాలో కల్తీ మద్యం కాటుకు దాదాపు 50 మంది బలైన సంగతి తెలిసిందే. ఇది అసెంబ్లీలో చర్చకు వచ్చి రాజకీయ దుమారం రేపింది.

బీహార్ సిఎం నితీష్‌కుమార్‌పై ఆనాడు విపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ జిల్లాలో వంద మంది కల్తీ మద్యానికి చనిపోయారని బీజేపీ ఆనాడు ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News